Monday, 18 June 2012

panchendriyamulu

ఈ పోస్ట్ రాయటానికి ముందు పంచేంద్రియముల కోసం  చాలా  వెబ్ సైట్ లు వెతికాను...
కానీ నాకు ఎక్కడ కనిపించలేదు, వచ్చాయ్ కానీ తెలుగులో ఏది కనిపించలేదు, అనుకని నేనే రాద్దాం తెలుగు లో అని మొదలు పెట్టాను.. 

పంచేంద్రియములు అంటే "పంచ" అనగా అయిదు "ఇంద్రియములు" అనగా జ్ఞానఅవయవములు 
వీటినే ఇంగ్లీష్ లో "ఫైవ్ సెన్సెస్" అంటారు.
ఇక ఏంటి ఆ అయిదు అంటే 
1. కళ్ళు           చూసే జ్ఞానం ను ఇచ్చేవి 
2. చెవులు       వినికిడి జ్ఞానం కలిగించేవి 
3. ముక్కు       వాసన పసిగట్టే జ్ఞానం కలిగించేది 
4. నాలుక        రుచి ని తెలిపేది 
5. శరీరము     స్పర్శ జ్ఞానం కలిగించేది 

ఈ అయిదు జ్ఞానేంద్రియములు, తమకు వచ్చిన ఆయా తరంగాలను మెదడుకు పంపిస్తాయి, మెదడు వాటిని తీసుకోని ఆ తరంగాలకు తగిన  పనిని ఆయా అవయవాలకి  సూచిస్తుంది. దాన్ని బట్టి మనకి 
రంగు, రుచి , ధ్వని , వాసన , స్పర్శ  తెలుస్తుంది.

ఉదాహరణకు ఒక పాత్ర వేడిగా ఉంది అని మనకి అది చూస్తే తెలుస్తుంది.
ఎంత వేడి గా ఉంది అది తాకితేనే కదా తెలుస్తుంది.
వేడి ఎక్కువ గా ఉంటే వెంటనే తెలుస్తుంది.
మీరు గమనించే ఉంటారు.
 ఆ వేడి యొక్క ఉదృతి ని బట్టి తరంగాల వేగం మారుతుంది.

వీటన్నిటికి అతీతమైనది ఇంకో ఇంద్రియము ఉంది అంటారు. దాన్నే ఇంగ్లీష్ లో sixth sense అంటారు.
దాని గురించి తర్వాతి పోస్ట్ లో వివరించటానికి ప్రయత్నిస్తా.



నోట్ : మీకు ఇంతకంటే ఎక్కువే తెలిసి ఉండ వచ్చు, తప్పులు ఉంటె సూచించమని మనవి. నాకు తెలిసింది అందరికి తెలియ చెయ్యాలనే ప్రయత్నం మాత్రమే. 


2 comments:

  1. పాత్ర వేడిగా ఉందా లేదా ముట్టుకుంటే కానీ తెలియదు. అసలు వేడి అనేది ఎప్పుడూ ఇంకో దానితో పోల్చితే నే చూడగలం. అది ఎప్పుడూ రోలేటివ్. పాత్రను ముట్టుకుంటే అది మన శరీరం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటే అది వేడిగా ఉందని , తక్కువ ఉష్ణోగ్రత లో ఉంటే చల్లగా ఉంది అని అంటాము.

    5 వ ఇంద్రియము చర్మము.

    ReplyDelete
  2. Sorry. Please don't be offended if you don't like My post. Also i want to know mahabharatam is written by you or typed by you.

    ReplyDelete