Wednesday, 9 May 2012

telugu Nakshatralu

తెలుగు నక్షత్రాలు 27
1. అశ్విని 
2.భరణి 
3.కృతిక 
4.రోహిణి 
5.మృగశిర 
6.ఆరుద్ర 
7.పునర్వసు 
9.పుష్యమి 
10.ఆశ్రేషా 
11. ముఖ 
12. పుబ్బ 
13.ఉత్తర 
14.హస్త 
15.చిత్త 
16.స్వాతి 
17. విశాఖ 
18.అనురాధ 
19.జేష్ట 
20.మూల 
21.పుర్వషాడ 
22.ఉత్తరషాడ 
23.శ్రవణం 
24. శ తభిష   
25. పూర్వాభాద్ర 
26. ఉత్తరాభాద్రా 
27. రేవతి
ఈ నక్షత్రాల పేర్లు చెప్తుంటే గుర్తొచింది,
దక్ష ప్రజాపతికి  అరవై అయిదు గురు కూతుళ్ళు అంట
వారిలో 27 మందికి వరసగా ఈ నక్షత్రాల పేర్లే అంట
వీరందరినీ చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేసాడంట..
మొన్న ఏదో ఒక పుస్తకం లో చదివాను..
అందరికి చెప్పాలని రాస్తున్న 

Wednesday, 25 April 2012

yugamulu


మనకి నాలుగు యుగాలు ఉన్నాయని పెద్దలు చెప్తారు 
అవి 
1  కృత యుగం 
2 త్రేతా యుగం
3 ద్వాపర యుగం 
4 కలి యుగం 
 ముందుగా కృత యుగం ఏంటో చూదాం.
ఈ యుగం లో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందంట.. (అంటే ఏంటో తెలుసుకోవాలి, తెలుసుకొని చెప్తా..)
అందరు సత్యం మాట్లాడుతూ నీతి గా ఉండే వారుట 

మరి త్రేతా యుగం
ఇది కొంచం ప్రక్యతి గాంచిన యుగం గా చెప్పొచు, ఎందుకంటే రాముడు ఈ యుగం వాడే కదా, రామాయణం తెలీయని వాళ్ళు ఉండరు. అందులో అయన ధర్మ పాలన గురించి తెలుస్తుంది. ఈ యుగం లో ధర్మం మూడు పాదాల మీద నడిచిందట, ఎందుకంటే మహా పతివ్రత అయిన సీతమ్మవారి మీద నిండా పడింది కదా.. 

తదుపరిది ద్వాపర యుగం 
ఈ యుగం కూడా ప్రక్యతి గాన్చినదే, ఎందుకంటే ఈ యుగం  శ్రీ కృష్ణుడు పరిపాలించాడు కదా.. ఆయన లీలలు తెలియని వారుండరు. భారతం లో ఈ యుగం గురించి ఉంటుంది. భారతం గురించి ఒక నానుడి ఉంది కదా
" వింటే భారతమే వినాలి తింటే గారెలే తినాలి" అని.. ఈ సందర్భం లో నాకు అది గుర్తుకు వచ్చింది. 
ఈ యుగం లో ధర్మం రెండు పాదాల మీద నడిచిందంట ఎందుకంటే శ్రీ కృష్ణుడి మీద నీలాపనిందలు మోపారు కదా..

ఇక మిగిలింది కలి యుగం 
ఈ యుగం అందరికి తెలిసిందే ఎందుకంటే, ప్రస్తుతం మనం ఉన్నది ఈ యుగం లో నే కాబట్టి, ఇప్పుడు మనం కలియుగం ప్రదమ పాదం లో ఉన్నామని పెద్దల మాట.. పాదానికి ఒక లక్ష  ఎనభై సంవత్సరాలు ఉంటుంది ట.. కాబట్టి ఇప్పుడప్పుడే యుగాంతం అవ్వదు ట.. కానీ ప్రక్రుతి వైపరిత్యాలు జరుగుతాయి ట..  ఈ యుగం వచ్చె సరికి  ధర్మం పూర్తి గా నశించి, వొంటి కాలితో కుంటుతూ నడుస్తుంది.. అది ఎలా నో అర్ధం అవుతూనే ఉంది.. ఒక్కలని ఒక్కళ్ళు కొట్టుకుంటారు, చంపుకుంటారు ట..  

ఇలా ఈరోజు యుగాల గురించి తెలుసుకున్నాం :)
మళ్ళి ఇంకొక కాన్సెప్ట్ తో తదుపరి పోస్ట్..





Monday, 23 April 2012

Telugu Nelala perlu

మన తెలుగు సంవత్సరం లో కూడా ఇంగ్లీష్ సంవత్సరం లాగ 12 నెలలు ఉంటాయి. 
చిన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్స్ లో చదివేవాళ్ళం.
 ఒక్క సారి  గుర్తు చేసుకుందాం..
1.  చైత్రం
2  వైశాఖం (ఇప్పుడు జరుగుతున్న నెల) 
౩  జైష్టం
4  ఆషాడం 
5  శ్రవణం
6  భాద్రపదం
7  ఆస్వియుజం
8  కార్తీకం
9  మార్గశిరం
10 పుష్యం 
11  మాఘం 
12  ఫాల్గుణం





Meaning of Savyasachi

సవ్యసాచి అంటే అర్థం ఏంటో తెల్సా

సవ్యసాచి అనేది అర్జునుడికి ఇంకో పేరు ట
అలా ఎందుకు పిలుస్తారో తెల్సా
అర్జునుడు రెండు చేతులతో ఒకే సరి బాణం విసరగలడంట

ఒకే రకమైన పనిని రెండు చేతులతో ఒకేసారి చేసే వాళ్ళని సవ్యసాచి అంటారు.